నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ఇది రవితేజ రేంజ్!
on Dec 27, 2022

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాలతో నిరాశపరిచాడు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఇక రవితేజ పని అయిపోయిందని, ఆయన మార్కెట్ పడిపోయిందని కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ కి రవితేజ తన తాజా చిత్రం 'ధమాకా'తో సమాధానమిచ్చాడు. రొటీన్ కమర్షియల్ మూవీ అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ సాధించి సత్తా చాటింది. దీంతో 'ఇది రవితేజ రేంజ్' అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.66 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.53 షేర్, మూడో రోజు రూ. 5.18 కోట్ల షేర్ రాబట్టిన ధమాకా.. నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ రూ.3.13 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో రూ.16.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. ఇప్పటిదాకా నైజాంలో రూ.7.51 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.84 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.6.15 కోట్ల షేర్ సాధించింది.
నాలుగు రోజుల్లో రెస్టాఫ్ ఇండియా రూ.1.40 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.1.02 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ధమాకా.. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.18.92 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.18.30 కోట్లు కాగా.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ఈరోజు నుంచి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.5.46 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.98 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.93 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.3.55 కోట్ల షేర్ రాబట్టిన ధమాకా.. ఇదే దూకుడు కొనసాగిస్తే బయ్యర్లకు భారీ లాభాలను మిగిల్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



