ఎన్టీఆర్, అల్లు అర్జున్... ఓ శ్రీలీల!
on Dec 27, 2022
.webp)
తెలుగులో హీరోయిన్లుగా వెలగాలంటే రెండు మూడు క్వాలిఫికేషన్ ఉండాలి. అందంగా ఉండాలి... ఎక్స్‌పోజింగ్ చేయాలి... డాన్సింగ్ లో అదుర్స్ అనిపించాలి.... ఆ మూడు ఉంటే చాలు మిగిలినవన్నీ పక్కన పెట్టేస్తారు. నటించడం చేతకాక పోయినా, భాష రాకపోయినా సరే లాంగ్ షాట్స్ తో సరిపెట్టేస్తారు. కానీ పైన చెప్పినవి మాత్రం చాలా కంపల్సరీ అంటారు. అలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్లే తెలుగులో పది కాలాలపాటు నిలబడతారు. తమన్నా ఇప్పటికీ తన హవా కొనసాగిస్తుందంటే దానికి ఆమెలోని డాన్సింగ్ స్కిల్సే కారణం. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వంటి వ్యక్తి తనకు తమన్నా పక్కన డాన్స్ వేయాలని ఉందని బహిరంగంగానే చెప్పాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరితోనో తమన్నా జోడి కట్టి స్టెప్పులతో, ఐటమ్ సాంగ్స్ తో మెప్పిస్తోంది.
ఇక విషయానికి వస్తే ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి క్యూ కడుతుంటారు. కానీ కొంతమందికి మాత్రమే టాప్ స్టార్ అయ్యే లక్షణాలు ఉంటాయి. అలా టాప్ స్టార్ హీరోయిన్గా కనీసం 10 ఏళ్ల పాటు చేతినిండా సినిమాలు దక్కించుకునే రేంజిలో టాలెంట్ ఉండి ఈ మధ్య కొత్తగా పరిశ్రమకు పరిచయమైన వారు కృతిశెట్టి, శ్రీలీలలు మాత్రమే. శ్రీలీల టాలెంట్ అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో బాగా మెప్పిస్తోంది. ఈ ఏడాది ఆమె పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు ధియేటర్ వైపు ప్రేక్షకులు క్యూ కట్టే లాగా చేశాయి. రవితేజ నటించిన ధమాకా చిత్రం వద్ద హిట్టుగా నిలిచింది. కథ, కథనం పెద్దగా లేకపోయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం శ్రీ లీలా అంటూ సినిమా రన్నింగ్ సమయంలో కామెంట్స్ వినిపించాయి. అందంతో పాటు అద్భుతమైన అభినయం, మెరుపు వేగంతో కూడిన డాన్స్ పాజిటివ్ టాక్ రావడానికి కూడా ప్రధాన కారణాలలో ఒకరు శ్రీలీల.
ఈమె వేసిన డాన్స్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఆమె డాన్స్ స్పీడ్ చూస్తుంటే ఈమె ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి డాన్సర్లు కూడా నిలుస్తారా లేదా అనే సందేహం రాక మానదు. ఇది కాస్త అతిశయోక్తి అనిపించొచ్చు. కానీ ఎంతో మంచి డాన్సర్స్ అయిన ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లకు సరైన పోటీగా డాన్స్ చేసే డాన్సింగ్ డాల్ దొరికి చాలా కాలం అవుతుంది. తమన్నా కెరీర్ చివరికి వచ్చింది. ఇలాంటి సమయంలో శ్రీల వారికి సరితూగేలా తాను డాన్సులతో మెప్పించగలనని, తెలుగులో డాన్స్ లో నెంబర్ వన్ గా చెప్పుకునే స్టార్ హీరో అందరితోనూ తాను పోటీగా స్టెప్స్ వేయగలనని నిరూపించుకుంటుంది. భవిష్యత్తులో ఈమె కేవలం టాలీవుడ్ ని మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతుంది అనడంలో సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈమె రెండు క్రేజీ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంది. వాటిల్లో ఒకటి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా. ఇందులో బాలకృష్ణకి కూతురిగా శ్రీ లీలా నటిస్తోంది. మరో చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా శ్రీ లీల నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే ఇక శ్రీ లీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదేమో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



