ఎన్టీఆర్ చెప్పిన కుమారి రివ్యూ
on Nov 20, 2015
.jpg)
సుకుమార్ రచించి ప్రొడ్యూస్ చేసిన కుమారి 21f సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని ముందే చూసేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించాడు. కుమారి టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలుస్తోందని చెప్పాడు. సినిమా చాలా కొత్తగా వుందంటూ, గురువు సుకుమార్ కథ, కథనం అద్భుతమంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తమ పాత్రలలో అద్భుతంగా నటించారని అన్నాడు. అంతేకాక సినిమాకు పనిచేసిన రత్నవేలు - దేవిలకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాడట. మొత్తానికి యంగ్ టైగర్ ను ఆకట్టుకున్న కుమారి బాక్స్ ఆఫీస్ ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో తెలియలంటే కొద్ది సేపు ఆగాల్సిందే!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



