బాహుబలికి చుక్కలు చూపించాడు!!
on Nov 19, 2015
.jpg)
వెండితెరపై బహుబలికి పోటీ ఇవ్వలేకపోయిన శ్రీమంతుడు, బుల్లితెరపై మాత్రం గట్టి పోటీనిచ్చాడు. ఒక దశలో ఈ సినిమా బహుబలి టీఆర్పీ రేటింగ్ దాటెస్తుందేమోనని అందరూ భావించారు కానీ కొద్దిగా తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తెలుగులో బాహుబలిని మాటీవీ సొంతం చేసుకొగా, శ్రీమంతుడుని జీ తెలుగు సొంతం చేసుకొంది. ఇటీవలే ఆ రెండు సినిమాలు టీవీల్లో ప్రదర్శితమయ్యాయి. బాహుబలికి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఆ ర్యాంకింగ్ ని శ్రీమంతుడు అధిగమించలేకపోయింది కానీ.... అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బాహుబలిని అధిగమిస్తూ రికార్డు స్థాయిలో రేటింగ్స్ ని సొంతం చేసుకొంది శ్రీమంతుడు చిత్రం. అర్బన్ ప్రాంతంలో బాహుబలికి 22.53 రేటింగ్ సంపాదిస్తే శ్రీమంతుడు మాత్రం 24.8 రేటింగ్ సొంతం చేసుకొన్నాడు. ఓవరాల్ గా చూస్తే బుల్లితెరపై బాహుబలికి - శ్రీమంతుడుకి గట్టి పోటీయే జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



