బిగ్ షాక్.. ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్!
on Oct 7, 2025

స్టార్ హీరోలు ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు కమిట్ అవ్వడం అరుదైపోయింది. టాలీవుడ్ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఎక్కువ సినిమాలు కమిట్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం చేసేవన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావడంతో.. ఒక్కో సినిమా పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే, ఏ సినిమా ముందు, ఏ సినిమా వెనుక అనే కన్ఫ్యూజన్ నెలకొంటుంది. ఒక్కోసారి ఫలానా సినిమా అసలు సెట్స్ మీదకి వెళ్తుందో లేదో కూడా తెలియట్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఇది జరుగుతోంది. తాజాగా ఆయన ఒక ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. (Jr NTR)
ఈ ఏడాది 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. కొరటాల శివతో 'దేవర-2' చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ ప్రాజెక్ట్, నెల్సన్ ప్రాజెక్ట్, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లైన్ లో ఉన్నాయి. అయితే 'డ్రాగన్' తర్వాత మొదట సెట్స్ పైకి వెళ్ళే సినిమా ఏదో ఇంకా క్లారిటీ లేదు. 'దేవర-2' ఖచ్చితంగా చేస్తానని ఎన్టీఆర్ చెప్పినప్పటికీ.. అసలు ఆ సినిమా ఉంటుందా లేదా? అనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా.. ఇక ఇప్పుడు 'దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్' నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (Dadasaheb Phalke Biopic)
రెండేళ్ల క్రితం ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 'మేడ్ ఇన్ ఇండియా' మూవీ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వంలో దీనిని అనౌన్స్ చేశారు. అధికారికంగా చెప్పనప్పటికీ.. ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఫాల్కే బయోపిక్ కావడంతో ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా సంబరపడ్డారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనకడుగు వేసినట్లు సమాచారం. (Made In India)
'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో హిందీ దర్శకుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. నిజానికి 'వార్-2'ని నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ ఒక సోలో ఫిల్మ్ చేయాల్సి ఉంది. కానీ, 'వార్-2' ఎఫెక్ట్ తో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారని టాక్. ఇక ఇప్పుడు 'మేడ్ ఇన్ ఇండియా' విషయంలోనూ.. బాలీవుడ్ డైరెక్టర్ కావడంతోనే ఎన్టీఆర్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా ఇప్పటికే పలు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఫాల్కే బయోపిక్ చేస్తే.. అందుకు తగ్గట్టుగా లుక్ మార్చుకోవాలి. ఆ సమయంలో ఇతర సినిమాలు చేయడం కూడా కుదరదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, 'మేడ్ ఇన్ ఇండియా' మూవీ చేయలేనని ఎన్టీఆర్ చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ వెనకడుగు వేయడంతో.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాలని 'మేడ్ ఇన్ ఇండియా' టీం నిర్ణయం తీసుకుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



