SSMB29 లేటెస్ట్ అప్‌డేట్.. రాజమౌళి ఎందుకిలా చేస్తున్నాడు?
on Oct 7, 2025
సూపర్‌స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎడ్వచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేశారు. మహేష్‌ని ఈ సినిమాలో ఒక కొత్త లుక్‌లో ప్రజెంట్ చెయ్యబోతున్నారు రాజమౌళి. మహేష్ చేస్తున్న ఈ 29వ సినిమా అతని కెరీర్‌లోనే డిఫరెంట్ మూవీగా నిలవనుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్, ప్రియాంక చోప్రాలపై ఒక అద్భుతమైన ఫోక్ సాంగ్‌ని ప్లాన్ చేశారట. ఎం.ఎం.కీరవాణి తనదైన స్టైల్‌లో మంచి మాస్ బీట్ ఉన్న ట్యూన్‌ని అందించారని తెలుస్తోంది. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ చేస్తున్నారనే వార్త బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇండియానా జోన్స్ సిరీస్‌లో హరిసన్ ఫోర్డ్ చేసిన సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్ సినిమాలను తలపించే ఈ సినిమాలో విచిత్రంగా ఫోక్ సాంగ్ పెట్టడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. సినిమా బ్యాక్‌డ్రాప్‌కి, అందులోని పాటకు ఎలాంటి సంబంధం ఉంటుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి ఏదో ఒక మ్యాజిక్ చేసి సినిమాను ఒక రేంజ్‌కి తీసుకెళ్తాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్, పృథ్విరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ వరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇక అప్‌డేట్స్ కూడా వరసగా వస్తాయని సమాచారం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు, ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ‘మాస్టర్ పీస్ లోడింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరి మహేష్, రాజమౌళి ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



