కాంతార చాప్టర్ 1 ని హిట్ చేసింది వీళ్లేనా!
on Oct 7, 2025

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1)జోరు కొనసాగుతు ఉంది. చాలా ఏళ్లుగా థియేటర్ ముఖం చూడని వాళ్ళు సైతం చాప్టర్ 1 కోసం థియేటర్ ముందు క్యూ కడుతున్నారు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, క్రికెట్ సెలబ్రిటీలు సైతం చాప్టర్ 1 చూసి, మూవీ చాలా బాగుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెప్తు వస్తున్నారు. అసలు ప్రస్తుత రోజుల్లో సినిమాని ఎంత బాగా తెరకెక్కించినా,ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రం యావరేజ్ గానే వస్తుంది. పైగా కాంతార కి ఫ్రీక్వెల్ గా చాప్టర్ 1 తెరకెక్కడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలని కూడా అందుకొని చాప్టర్ 1 విజయ డంకా మోగించింది. చాప్టర్ 1 ఎందుకు అంతలా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది! ఏ ఏ అంశాలు ప్రధాన బలంగా నిలిచాయో చూద్దాం.
చాప్టర్ 1 లో ముందుగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది రిషబ్ శెట్టి(Rishab Shetty)పోషించిన 'బెర్మే క్యారక్టర్. ఎలాంటి కల్లా కపటం లేని, మంచి తనం అణువణువునా మూర్తీభవించిన బెర్మే, తన తెగ ప్రజలు వ్యాపార పరంగా బాగుపడాలనే చేసే పోరాటం ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. అదే విధంగా తన తల్లిని చంపినప్పుడు బెర్మే లో పంజర్లీ దైవం ఆవహించి కులశేఖర చక్రవర్తిని అంతం చేసే సందర్భంలో వచ్చే సీన్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. దైవశక్తిని పొందాలనుకుని రాజు, క్షుద్ర మాంత్రికులు ఒక్కటవ్వడం, రుక్మిణి వసంత్(Rukmini Vasanth)పోషించిన కనకవతి అనే యువరాణి క్యారక్టర్ నెగిటివ్ షేడ్ కి మారడం కూడా మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో శివుడు,చాముండేశ్వరి ఆవహించినప్పుడు బెర్మే ప్రదర్శించిన హావ భావాలు, ఆ ఇద్దర్ని అంతం చేసిన తీరు ఘన విజయంలో ప్రధాన బలంగా నిలిచాయి.
మూవీ స్టార్టింగ్ లోనే 'శివుని పూదోట' గురించి చెప్పి, ఆ చోటు శివుడు ప్రశాంతంగా ఉండటానికి పార్వతి దేవి ఏర్పాటు చేసిందని చెప్పడంతో ప్రేక్షకులు శివుడి పూదోట గురించే ఆలోచించడం ప్రారంభించారు. పైగా మధ్య మధ్యలో పార్వతి దేవి అంశ అయిన పులి కనపడుతుండటం, ఆ పులి దుష్టుల్ని చంపి 'బెర్మే ని ఏమి అనకపోవడం, పులి,బెర్మే కళ్ళల్లో ఒకే విధంగా మెరుపులు, రావడంతో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. అందుకే మూవీలో అనవసరమైన సీన్స్ చాలా వచ్చినా, ప్రేక్షకులు మాత్రం శివుని పూదోట గురించి ఆలోచిస్తు ఉన్నారు. అందుకు తగ్గట్టే క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండటం, చివర్లో తను చిన్నపుడు ఎక్కడైతే దొరికాడో అదే చోటులో బెర్మే దూకడంతో థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకులు సంతృప్తికి లోనయ్యారు. అందుకే మౌత్ టాక్ తో కాంతార రోజు రోజుకి తన టాక్ రేంజ్ ని పెంచుకుంటు సూపర్ హిట్ గా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



