దటీజ్ 'జోకర్'... రెండోసారీ 'ఆస్కార్' కొట్టాడు
on Feb 10, 2020

ఆస్కార్ విజేతలు ఎవరో ప్రపంచానికి తెలిసింది. ఇండియాలో హాలీవుడ్ సినిమా అభిమానులు అందరూ ఉదయమే నిద్రలేచి టీవీలకు అతుక్కుపోయారు. 'జోకర్'కు ఆస్కార్ వచ్చింది. అదే 'జోకర్' పాత్రలో నటించిన జాక్విన్ ఫోనిక్స్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. దాంతో 'జోకర్' ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. దటీజ్ జోకర్ అంటూ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు.
ఓ పాత్రకు ఆస్కార్ రావడం ఇది రెండోసారి. హాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన 'గాడ్ ఫాదర్' సిరీస్ లో వీటో క్లారియన్ పాత్రకు రెండుసార్లు ఆస్కార్ వచ్చింది. 'ది గాడ్ ఫాదర్'లో వీటో క్లారియన్ పాత్ర పోషించిన మార్లిన్ బ్రాండో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. తర్వాత 'ది గాడ్ ఫాదర్' సిరీస్ లో రెండో సినిమాలో వీటో పాత్ర పోషించిన రాబర్ట్ డి నీరో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. 'జోకర్' విషయానికి వస్తే... 'బ్యాట్ మ్యాన్: డార్క్ నైట్'లో జోకర్ పాత్ర పోషించిన హీత్ లెడ్జెర్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. అందులో ఆ పాత్రను బేస్ చేసుకుని 'జోకర్' సినిమా వచ్చింది. ఈసారి జోకర్ పాత్ర పోషించిన జాక్విన్ ఫోనిక్స్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక, 92వ ఆస్కార్ విజేతల వివరాలకు వస్తే...
ఉత్తమ నటుడు: జాక్విన్ ఫోనిక్స్ (జోకర్)
నటి: రెనీ జెల్‌వెగర్ (జూడీ)
సినిమా: పారాసైట్
సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
సహాయనటి: లారా డ్రెన్(మ్యారేజ్ స్టోరీ)
దర్శకుడు: బోన్ జోన్ హో (పారాసైట్)
అంతర్జాతీయ సినిమా: పారాసైట్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



