నా కట్టె కాలేవరకు పవన్ కల్యాణ్ అభిమానినే!
on Dec 5, 2022
.webp)
పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇండస్ట్రీలో అందిరికీ సుపరిచితుడే. ఈయన మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్న సంగతి కూడా చాలామందికి తెలుసు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నా, రాంచరణ్ అన్నా తనకు ఎంత ఇష్టమో, ఎందుకు ఇష్టమో అనే విషయాన్ని కూడా చాలా సార్లు, చాలా వేదికలపై చెప్పారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు.
జానీ మాస్టర్ తన సొంత జిల్లా అయిన నెల్లూరులో జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మైనారిటీ జనసైనికులు ‘‘పవన్ కల్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీని గెలిపించండి’’ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ ఆహ్వానం మేరకు జానీ మాస్టర్ ఈ సభకు హాజరయ్యారు. జనసేన పార్టీ గురించి, పవన్ కల్యాణ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కట్టె కాలేవరకు పవన్ కల్యాణ్ అభిమానిని అంటూ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టం అని, తన కెరీర్‌ను నిర్మించుకొనే విషయంలో ఆయన చేసిన సహాయం మర్చిపోలేనిదని అన్నారు. నెల్లూరు నుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా అభిమానం సంపాదించినందుకు గర్వపడుతున్నానన్నారు. పవన్ కల్యాణ్ అనుకున్నది నెరవేరాలని ఆకాంక్షించారు. కిషోర్, అతడి బృందానికి అభినందనలు తెలియజేశారు. స్థానికంగా ఏదైనా సమస్య ఉంటే కిషోర్ బృందానికి చెప్తే చాలు వాళ్ళు పరిష్కరిస్తారని కూడా చెప్పారు. ఇక జానీ మాస్టర్ ద్రోణ మూవీతో కొరియోగ్రాఫర్‌గా మారారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



