బాలయ్య సరసన ప్రియాంక!
on Dec 5, 2022

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో 'ఎన్‌బీకే108' రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ కోసం కొంతకాలంగా అన్వేషిస్తూ వస్తున్నాడు అనిల్. మొదట బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను సంప్రదించారు. అయితే ఆమె భారీ రెమ్యూనరేషన్ అడగడంతో, ఆమెను తీసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నారు.
తాజా రిపోర్టుల ప్రకారం తెలుగమ్మాయి ప్రియాంక జవల్కర్‌ను తీసుకోవాలని అనిల్ భావిస్తున్నాడు. ఈ అనంతపురం అమ్మాయితో ఇప్పటికే అతను ఫొటో షూట్ చేశాడంట కూడా. ఆమె విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 'టాక్సీవాలా'లో విజయ్ దేవరకొండ సరసన నటించడం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రియాంక, ఆ తర్వాత 'యస్ఆర్ కల్యాణమండపం' సినిమాలో కిరణ్ అబ్బవరం జోడీగా మరోసారి ఆకట్టుకుంది. బాలయ్య సరసన నటించే ఛాన్స్ దొరికితే ఆమె కెరీర్ ఊపందుకోవడం ఖాయం.
'ఎన్‌బీకే108' మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో డిసెంబర్ 8న మొదలు కానున్నది. తొలి షెడ్యూల్‌లో బాలయ్య, కొంతమంది ఫైటర్లపై ఒక యాక్షన్ సీన్‌ను అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



