7 ఏళ్లుగా హిట్ చూడని జాన్వీకపూర్.. ఆశలన్నీ ఆ మూవీపైనే
on Aug 5, 2025
.webp)
భారతీయ చిత్ర పరిశ్రమని తన నటనతో, అందంతో శాసించిన తెలుగు నటి 'శ్రీదేవి'(Sridevi). ఆ శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor)2018 లో 'దఢక్' అనే బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు నటిగా జాన్వీకి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు వరుస పరాజయాన్ని చవి చూశాయి.గత ఏడాది ఎన్నో ఆశలతో చేసిన స్పై థ్రిల్లర్ మూవీ 'ఉల్జా' కూడా పరాజయాన్ని అందుకుంది. దీంతో జాన్వీ కి ఏడు సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో సరైన హిట్ లేదు.
ప్రస్తుతం 'పరమ్ సుందరి'(Param sundari),'సన్నీ సంస్కారికి తులసి కుమారి', 'హోమ్ బౌండ్' అనే మూడు విభిన్న కథాంశాలతో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రాలు జాన్వీ చేతిలో ఉన్నాయి. వీటిల్లో రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన 'పరమ్ సుందరి' ఈ నెల 29 న విడుదల కానుంది. సంవత్సరం తర్వాత జాన్వీ నుంచి వస్తున్న మూవీ కావడంతో పరమ్ సుందరి తో జాన్వీ హిట్ ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. త్వరలో 'వార్ 2 'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కియారా అద్వానీ' హస్బెండ్ 'సిద్దార్ధ్ మల్హోత్రా' తో జాన్వీ 'పరమ్ సుందరి' లో జోడి కట్టింది.
ఇక 'సన్నీ సంస్కారికి తులసి కుమారి' అక్టోబర్ 2 న విడుదల కానుంది. 'హోమ్ బౌండ్' చిత్రాన్ని ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన కేన్స్ ఫెస్టివల్(Canes festival)లో ప్రదర్శించారు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. జాన్వీ తెలుగులో మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)తో 'దేవర'(Devara)లో జత కట్టి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రెస్టేజియస్ట్ మూవీ 'పెద్ది'(Peddi)లో చేస్తుంది. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 2026 న పెద్ది విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



