వీరమల్లు మూవీ పబ్లిక్ కి నచ్చింది.. రివ్యూ రైటర్లకే మెచ్యూరిటీ లేదు!
on Aug 5, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మొదటి షో నుంచే మెజారిటీ రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో వీరమల్లు మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిలిగింది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు జ్యోతికృష్ణ.. రివ్యూ రైటర్లకు మెచ్యూరిటీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Hari Hara Veera Mallu)
రివ్యూలు అనేది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతాయని కొందరు మేకర్స్ నమ్ముతుంటారు. అందుకే తమ సినిమాకి నెగటివ్ రివ్యూలు వస్తే.. రకరకాలుగా స్పందిస్తుంటారు. దర్శకుడు జ్యోతికృష్ణ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివ్యూ రైటర్లపై అసహనం వ్యక్తం చేశారు.
"ఇప్పుడు ప్రతి ఒక్కరూ రివ్యూయర్స్ అయిపోయారు. వాళ్ళు సినిమాని సినిమాలా చూడట్లేదు. ఈ సాంగ్ బాగుంది, ఈ ఫైట్ బాగుంది అన్నట్టుగా చూస్తున్నారు. అసలు ఈ కథ ఏంటి? ఎందుకిలా చేశారు? అని చూడట్లేదు. వాళ్లకి అంత మెచ్యూరిటీ లేదు. మేము ఇన్నేళ్లు కష్టపడి ఏదో టైం పాస్ కి సినిమా చేయము కదా. చూసేవాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రావాలి అనిపిస్తుంది. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడం కూడా రావాలి. క్లయిమాక్స్ కమర్షియల్ గా లేదని కొందరు రాశారు. కానీ, పబ్లిక్ కి ఆ క్లయిమాక్స్ నచ్చింది." అని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



