అందుకే 'చిరు' విరామం..!
on May 15, 2017

ఖైదీ నెం 150 చిత్రంతో భారీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర ఘన విజయం తో అదే స్థాయిలో కొత్త చిత్రాల ప్రణాళికలను చేసేస్తున్నారు.తనదైన శైలిలో మెప్పించిన చిరంజీవి షెడ్యూల్ పైనే అందరి దృష్టి పడింది. తాను 'ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి' చిత్రం తో త్వరలో సందడి చేయనున్నాడు.ఆ చిత్రం కోసం కసరత్తు భారీ స్థాయిలో చేస్తున్నారు.ఈ చిత్రాన్నిసురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నారు.
మరోపక్క చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కొద్దిగా విరామం ప్రకటించి విహారయాత్రకు వెళ్లనున్నారని సమాచారం. విశ్రాంతి కోసం రెండు వారాల పాటు 'చిరు' విరామం ప్రకటించి ఆయన జపాన్‌కు వెళ్లనున్నారని తెలిసింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొత్త చిత్రం'ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ' షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంపై సరికొత్త అంచనాలు నెలకొన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



