`#SSMB28`.. టైటిల్, మహేశ్ రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్
on May 6, 2021
తెలుగు ప్రేక్షకులు మెచ్చిన కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు - ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `అతడు`, `ఖలేజా` చిత్రాలు వెండితెరపై కంటే బుల్లితెరపైనే అమితాదరణ పొందాయి. అయినప్పటికీ.. పదేళ్ళకు పైగా వీరి కాంబినేషన్ లో మూడో చిత్రం కోసం ఇరువర్గాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ కాంబో సెట్ అయింది. మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న వీరి థర్డ్ జాయింట్ వెంచర్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. `#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి టైటిల్, మహేశ్ రోల్ పై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. `అతడు` చిత్రంలోని మహేశ్ స్క్రీన్
నేమ్స్ లో ఒకటైన `పార్థు`ని `#SSMB 28`కి టైటిల్ గా లాక్ చేశారని.. అలాగే ఇందులో మహేశ్ `రా` ఏజెంట్ గా కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే
కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`#SSMB 28`ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుండగా.. తమన్ బాణీలు అందించనున్నారు. 2022 వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.