'ఆర్ఆర్ఆర్'ను తలదన్నేలా 'డ్రాగన్'.. మరోసారి పాన్ వరల్డ్ ని షేక్ చేయబోతున్న ఎన్టీఆర్!
on Jan 20, 2026

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్
యాక్షన్ సీన్స్ పై స్పెషల్ కేర్
ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ ని మించేలా భారీ యాక్షన్ ఎపిసోడ్
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత విదేశాల్లో మరో కీలక షెడ్యూల్ జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ కి తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. అభిమానులు పండగ చేసుకుంటారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆయన విజృంభించే తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఇక తక్కువ సినిమాలతోనే ప్రశాంత్ నీల్ కూడా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తెరకెక్కించడంలో ఆయన దిట్ట. (NTR Neel)
అందుకే ఎన్టీఆర్-నీల్ కాంబో కావడంతో 'డ్రాగన్'లో భారీ యాక్షన్ సీన్స్ ఆశిస్తున్నారు అభిమానులు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఒక యాక్షన్ ఎపిసోడ్ చాలాకాలం పాటు గుర్తుండటం ఖాయమని చెబుతున్నారు.
ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హేన్ ఆధ్వర్యంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రూపొందిస్తున్నారట. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఒకటిగా నిలిచేలా దీనిని ప్లాన్ చేశారట.
'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎన్టీఆర్ కి గ్లోబల్ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు 'డ్రాగన్'లో అంతకుమించిన స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేసినట్లు వినికిడి. సినిమా విడుదల తర్వాత ఈ సీక్వెన్స్ గురించి మరోసారి గ్లోబల్ స్థాయిలో చర్చ జరగడం ఖాయమనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
Also Read: శివాజీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్.. ఒక్కసారిగా లెక్కలు మారాయి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



