హైకోర్ట్ కీలక నిర్ణయం.. రాజాసాబ్ లాంటి సినిమాలకి అన్యాయం జరగకూడదు
on Jan 20, 2026

-తెలంగాణ హైకోర్టు అదిరిపోయే తీర్పు
-ఎందుకు ప్రతి సారి టెన్షన్
-రాజా సాబ్ కి ఏం జరిగిందో తెలియదా!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)'ది రాజాసాబ్'(The Rajasaab)తో జనవరి 9 న థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే . జనవరి 8 న బెనిఫిట్ షో కూడా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్ పెద్ద ఎత్తున రాజా సాబ్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం తమకి అందుబాటులో ఉన్న యాప్స్ దగ్గర స్టే అయ్యారు. కానీ సదరు యాప్స్ తమ సైట్ లో రాజా సాబ్ టికెట్స్ ని ఉంచలేదు.ఐదారు రోజుల నుంచే బుకింగ్స్ ఓపెన్ చేసే యాప్స్ ఎనిమిదవ తారీకు రాత్రి 10 .30 దాకా కూడా రాజా సాబ్ కి ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో అందరు షాక్.
అసలు షో ఉందా లేదా అనే పరిస్థితి. ఫ్యాన్స్, మేకర్స్ బాధ అయితే వర్ణనాతీతం. ఆ తతంగం మొత్తానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ కి ఒక రోజు, రెండు రోజుల ముందు రాజా సాబ్ టికెట్స్ పెంపుకి మేకర్స్ కోరినట్టుగా పర్మిషన్ ఇవ్వడం. ఆ తర్వాత ఎవరో ఒకరు టికెట్ రేట్స్ పెంపుపై హై కోర్ట్ కి వెళ్లి స్టే తీసుకురావడంతో రాజా సాబ్ ప్రదర్శనపై గందర గోళం నెలకొని ఉంది. ఆ కారణంతోనే యాప్స్ నిర్వాహకులు టికెట్స్ ని అందుబాటులో ఉంచలేదు. ఇంచు మించు బడా సినిమాలకి ఇదే పరిస్థితి. ఇక ఈ గందర గోళానికి తెరదించుతు తెలంగాణా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: యాక్సిడెంట్ కి గురైన అక్షయ కుమార్.. చేసింది ఇతనే
ఇకముందు సినిమా టిక్కెట్ రేట్లు పెంపు విషయంలో ప్రభుత్వం 90 రోజుల ముందు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు(Telangana Highcourt)తీర్పు ఇచ్చింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్, 1955 ప్రకారం హైకోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ తీర్పు వల్ల అభిమానులు, మేకర్స్ , హీరోలకి, ముఖ్యంగా తెలుగు సినిమాకి టెన్షన్ ఎట్మాస్పియర్ నుంచి ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినపడుతుంది. మరి తెలంగాణ హైకోర్టు దారిలోనే ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కూడా పయనిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



