23 ఆత్మహత్యలని ఆపిన సినిమా.. గ్రేట్ కదా
on Jan 20, 2026

-సినిమాకి మనిషి జీవితాన్ని మార్చే శక్తీ ఉందా .?
-ఆ సినిమా ఏకంగా 23 ఆత్మహత్యలు ఆపింది..
-50 లక్షలతో తీస్తే 120 కోట్లు కలెక్ట్ చేసింది.
-ఇంటరెస్టింగ్ న్యూస్ మీకోసం.!
ఈ అనంత విశ్వంలో ఎలాంటి స్వార్ధం లేకుండా మనిషికి మంచిని, వినోదాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సమపాళ్ళల్లో అందించే సాధనం ఏదైనా ఉంది అంటే అది సినిమా మాత్రమే అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ సినిమా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న 23 మందిని ఆత్మహత్య చేసుకోకుండా నివారించింది. అంతలా ప్రేరేపించిన ఆ మూవీ ఏంటో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
లాలో- కృష్ణ సదా సహాయతే(Laalo Krishna Sada Sahaayate)..గత ఏడాది అక్టోబర్ 10 న గుజరాత్ లో రిలీజైన లోకల్ మూవీ. అంకిత్ సహియా(Ankit Sakhiya) రచనా దర్శకత్వంలో సృహాద్ గోసామి, రీవా రచ్, కరణ్ జోషి ముఖ్య పాత్రలు పోషించారు. ప్రతి నిత్యం మనిషి మనుసుల చుట్టు రంగులరాట్నంలా తిరుగుతుండే సంతోషం, బాధ,దిగులు, నిరాశ ల నేపధ్యంతో కథ, కథనాలు రన్ అవుతాయి. రీసెంట్ గా దర్శకుడు అంకిత్ మాట్లాడుతు మా మూవీ చూసిన తర్వాత జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న ఇరవై మూడు మంది ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ విషయాన్నీ వాళ్లే నాతో చెప్పడం జరిగింది.అంతలా మా మూవీ నిరాశ నిస్పృహలతో ఉన్న ఎంతో మంది కొత్త జీవితానికి నాంది పలికేలా చేసింది.ఒక సారి థియేటర్ కి వెళ్ళినప్పుడు విష్ణు అనే వ్యక్తి వచ్చి సినిమా చాలా బాగుందని 5000 రూపాయలు ఇచ్చాడు. అది నాకెంతో భావోద్వేగాన్ని కలిగించిందని అంకిత్ సహియా చెప్పుకొచ్చాడు.
Also read: తేడా రాకుండా చూసుకోవాలి.. టైలర్ మేడ్ ఖాయమా!
కంటెంట్ మనుషుల మనసులకి సంబంధించింది కావడంతో హిందీలో కూడా జనవరి 9 న రిలీజ్ చేసారు. మంచి టాక్ తోనే రన్ అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు, నిరాశలో ఉన్న ఒక రిక్షా కార్మికుడి పై ఎలాంటి ప్రభావం చూపించాయి అనే పాయింట్ తో లాలో- కృష్ణ సదా సహాయతే తెరకెక్కింది. 50 లక్షలతో నిర్మించగా 120 కోట్లు దాకా రాబట్టడం విజయం యొక్క రేంజ్ ని తెలుపుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



