ఆసుపత్రి పాలైన శ్రీవిష్ణు
on Jul 22, 2022

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న శ్రీ విష్ణు ఇంటి నుంచే చికిత్స పొందుతున్నాడు. అయితే ఈరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత నీరసించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు శ్రీ విష్ణుకి చికిత్స అందిస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే శ్రీ విష్ణు ప్రస్తుతం 'అల్లూరి' అనే సినిమా చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



