'థాంక్యూ' ఓపెనింగ్స్.. దిల్ రాజుకు షాకిచ్చిన ప్రేక్షకులు
on Jul 23, 2022

నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ' మూవీ శుక్రవారం విడుదలై అంచనాలకు ఏమాత్రం అందని రీతిలో చాలా తక్కువ ఓపెనింగ్స్‌ను సాధించింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా చైతూ కెరీర్‌లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా అపకీర్తిని సొంతం చేసుకుంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 20 అంతకంటే తక్కువ శాతం సీట్లు ఫుల్ అవడం ఆశ్చర్యకరం.
తెలంగాణలో ఎడతెరపి లేకుండా పడ్తున్న వర్షాలు ఇందుకు ఓ కారణమైతే, నెగటివ్ టాక్ కూడా ఇంత తక్కువ ఓసెనింగ్స్ రావడానికి మరో కారణమని విశ్లేషకులు అంటున్నారు. నాగచైతన్య మునుపటి రెండు సినిమాలు 'లవ్ స్టోరి', 'బంగార్రాజు'కు మంచి ఓపెనింగ్స్ రాగా, 'థాంక్యూ'కు వాటిలో సగం కూడా రాకపోవడం ఏమిటని ఇండస్ట్రీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
బీవీఎస్ రవి అందించిన కథలో కొంత విషయమున్నా, దాన్ని విక్రమ్ కుమార్ స్క్రీన్ మీదకు తెచ్చిన తీరు మరీ బలహీనంగా ఉంది. తెలుగువన్ రివ్యూలోనూ ఆ విషయమే ప్రస్తావించారు. హృదయాన్ని హత్తుకొనే సన్నివేశాలు అతి తక్కువగా, విసుగు తెప్పించే సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే థాంక్యూకు బ్యాడ్ టాక్ తెప్పించాయి. ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి ఆశాజనకంగా లేదు. హిందీలో 'హిట్ ద సెకండ్ కేస్', తెలుగులో 'థాంక్యూ'తో వరుస ఫ్లాపులు చవిచూశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



