జాతీయ అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రం 'కలర్ ఫొటో'.. బెస్ట్ యాక్టర్ సూర్య!
on Jul 22, 2022

2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫోటో' నిలవగా.. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో 'నాట్యం' సినిమా రెండు అవార్డులు గెలుచుకుంది. అలాగే 'అల వైకుంఠపురములో' సినిమా సాంగ్స్ కి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇక జాతీయ అవార్డుల్లో కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన 'సూరారై పోట్రు'(ఆకాశం నీ హద్దురా) సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్(సూర్య), బెస్ట్ యాక్ట్రెస్(అపర్ణ), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్ గా సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అవార్డు పంచుకోకున్నాడు. 'తానాజీ' సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డు గెలుచుకున్నాడు.
68వ జాతీయ చలనచిత్ర అవార్డులు:
ఉత్తమ చిత్రం - సూరారై పొట్రు (తమిళం)
ఉత్తమ నటుడు - సూర్య (సూరారై పొట్రు), అజయ్ దేవ్‌గణ్ (తానాజీ)
ఉత్తమ నటి - అపర్ణ బాలమురళి (సూరారై పొట్రు)
ఉత్తమ సహాయనటుడు - బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్)
ఉత్తమ సహాయ నటి - లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
ఉత్తమ బాల నటుడు - వరున్ బుద్దదేవ్(తులసీదాస్ జూనియర్)- స్పెషల్ మెన్షన్
ఉత్తమ దర్శకుడు - సచీ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - మడొన్నే అశ్విన్ (మండేలా)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్) - తమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాగ్రౌండ్ స్కోర్) - జి.వి. ప్రకాశ్‌కుమార్ (సూరారై పొట్రు)
బెస్ట్ స్క్రీన్‌ప్లే - సుధ కొంగర, శాలిని ఉషా నాయర్ (సూరారై పొట్రు)
బెస్ట్ డైలాగ్స్ - మడొన్నే అశ్విన్ (మండేలా - తమిళం)
బెస్ట్ ఎడిటింగ్ - ఎ. శ్రీకర్ ప్రసాద్ (శివరంజనియుమ్ ఇన్నుమ్ శిల పెంగలుమ్ - తమిళం)
బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియుమ్ (మలయాళం)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - నచికేట్ బర్వే, మహేష్ షేర్లా(తానాజీ)
బెస్ట్ లిరిక్ - సైనా(మనోజ్ మౌతషిర్)
బెస్ట్ కొరియోగ్రఫీ - సంధ్యా రాజు (నాట్యం - తెలుగు)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - నాట్యం (టి.వి. రాంబాబు)
ఉత్తమ తెలుగు చిత్రం - కలర్ ఫొటో
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



