పెళ్లిదుస్తుల్లో వరుడితో శోభిత.. వైరల్ అవుతున్న ఫొటోలు!
on Nov 2, 2022

'గూఢచారి', 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచిన తార.. శోభితా ధూళిపాళ. తక్కువ కాలంలోనే ఆమె దేశవ్యాప్తంగా తన నటనతో పేరు తెచ్చుకుంది. శోభిత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్‌గా ఆమెకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు షాకయ్యారు.
శోభిత పెళ్లి దుస్తులలో వరుడితో ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె తెల్లటి దుస్తులలో చాలా అందంగా కనిపించింది. శోభిత దుబాయ్ నుండి ఈ ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోలను చూసి ఆమె ఎవరికీ ముందుగా చెప్పకుండా పెళ్లి చేసుకుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఆమె షేర్ చేసింది.. వోగ్ మ్యాగజైన్ కోసం చేసిన కొత్త ఫోటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు!
శోభిత చేసిన పోస్ట్ వైరల్ కావడంతో పాటు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఫోటోపై ఆసక్తికర కామెంట్లు వచ్చాయి. "కొన్ని సెకన్ల పాటు నేను అయిపోయానని అనుకున్నా. నీ పెళ్లి అయిపోయిందని అనుకుని, నా గుండె పగిలిపోయింది." అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. శోభిత పోస్ట్‌పై స్టార్స్ కూడా కామెంట్స్ చేశారు.
ఇటీవల ఆమె నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. నాగ చైతన్య హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొన్నాడని, శోభితను అక్కడికి ఆహ్వానించాడని ప్రచారం జరిగింది. అంతేకాదు, శోభిత పుట్టినరోజుకి నాగ చైతన్య కూడా హాజరయ్యాడని వార్తలు వచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



