ఘనంగా నాగశౌర్య పెళ్లి
on Nov 20, 2022

యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడయ్యాడు. బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఈరోజు శౌర్య వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అనూష మెడలో శౌర్య మూడు ముళ్లు వేశాడు.
నాగశౌర్య-అనూషల వివాహం బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ఈరోజు(నవంబర్ 20) ఉదయం 11:25 కి శౌర్య, అనూష మెడలో తాళికట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



