ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత
on Nov 19, 2022

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గత రాత్రి 1 గంట తర్వాత మృతి చెందారు.
నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన మదన్ ని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. నిన్ననే ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. కొందరు అత్యుత్సాహంతో నిన్న సాయంత్రం ఆయన మరణించినట్టు కూడా రాసుకొచ్చారు. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు.
క్లాసిక్ ఫిల్మ్ 'ఆ నలుగురు'కి కథ, కథనం, సంభాషణలు అందించిన మదన్.. 'పెళ్ళైన కొత్తలో' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు', 'గాయత్రి' వంటి సినిమాలు వచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



