కార్తికేయ.. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేనా?
on Oct 20, 2021
`ప్రేమతో మీ కార్తిక్` (2017)తో కథానాయకుడిగా పరిచయమైనా.. రెండో చిత్రం `ఆర్ ఎక్స్ 100`(2018)తోనే తొలి విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన `ఆర్ ఎక్స్ 100`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ సొంతం చేసుకోలేకపోయాడు. `హిప్పీ`, `గుణ 369`, `90 ఎం.ఎల్`.. ఇలా 2019లో హీరోగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని మూటగట్టుకున్న కార్తికేయ, అదే క్యాలెండర్ ఇయర్ లో ప్రతినాయకుడిగా నటించిన `గ్యాంగ్ లీడర్`తోనూ నిరాశజనక ఫలితాన్ని అందుకున్నాడు.
ఇక ఈ ఏడాది ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ అంచనాల నడుమ విడుదలైన `చావు కబురు చల్లగా` కూడా ఫెయిల్యూర్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే `రాజా విక్రమార్క`పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. శ్రీ సరిపల్లి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్.ఐ.ఎ ఏజెంట్ గా దర్శనమివ్వనున్నాడు కార్తికేయ. మరి.. సరికొత్త పాత్రలో ఎంటర్టైన్ చేయనున్న కార్తికేయ.. ఈ సినిమాతోనైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
కాగా, కార్తికేయ విలన్ గా నటిస్తున్న తమిళ చిత్రం `వలిమై` 2022 పొంగల్ కి రిలీజ్ కానుంది. తల అజిత్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.