బాలా చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్!
on Oct 20, 2021

తమిళనాట వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్. తెలుగులోనూ `వరల్డ్ ఫేమస్ లవర్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో తనదైన అభినయంతో అలరించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ ని ఓ బంపర్ ఆఫర్ వరించిందట. ఆ వివరాల్లోకి వెళితే.. `నంద`, `పితామగన్` (శివపుత్రుడు) చిత్రాలతో తన కెరీర్ ని మేలిమలుపు తిప్పిన తన లక్కీ కెప్టెన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య ఓ సినిమాని నిర్మించనున్నారు. ఇందులో అధర్వ మురళి కథానాయకుడిగా నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు సూర్య.
కాగా, ఈ సినిమాలో లీడింగ్ లేడీగా ఐశ్వర్యా రాజేశ్ ని ఎంచుకున్నారని సమాచారం. అదే గనుక నిజమైతే.. ఐశ్వర్యకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. బాలా చిత్రాల్లో దాదాపుగా నాయిక పాత్రలన్నీ ప్రాధాన్యమున్నవే. లైలా, సంగీత వంటి నిన్నటి తరం అగ్ర కథానాయికలు సైతం బాలా డైరెక్టోరియల్స్ తోనే కోలీవుడ్ లో తమదైన ముద్ర వేశారు కూడా. మరి.. బాలా కాంబినేషన్ మూవీతో నటిగా ఐశ్వర్యా రాజేశ్ స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



