'ఎఫ్3' మూవీని ఏ ఓటీటీపై ఎప్పుడు చూడొచ్చంటే..
on Jul 13, 2022

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్3' మూవీ మే 27న థియేటర్లలో విడుదలై చెప్పుకోదగ్గ కలెక్షన్లనే సాధించింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 130 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు తీసుకువస్తామని మాటిచ్చిన దానికి అనుగుణంగా నిర్మాతలు ఆ మూవీ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 22న రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ మూవీ రిలీజవుతోంది. అవి.. నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆ రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు ఈ విషయాన్ని తెలియజేశాయి.
మంగళవారం రాత్రి 'ఎఫ్3' పోస్టర్‌ను షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్విట్టర్ హ్యాండిల్, "Triple the fun. Triple the funny. Triple the frustration. F3 is coming to Netflix on the 22nd of July in Telugu!". అని రాసుకొచ్చింది. దానికంటే ముందు, సోనీలివ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆ మూవీ అఫిషియల్ ట్రైలర్‌ను షేర్ చేసి, "Be prepared for a hilarious journey with @VenkyMama, @IAmVarunTej, @tamannaahspeaks, @hegdepooja and @Mehreenpirzada. Watch F3 on #SonyLIV from 22nd July. #F3OnSonyLIV". అని తెలిపింది.
2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ కామెడీ ఫిల్మ్ 'ఎఫ్2'కు సీక్వెల్ అయిన 'ఎఫ్3'లో ప్రధాన పాత్రధారులు నలుగురూ.. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాడా.. అవే పాత్రల్లో కనిపించారు. ఈ రెండు సినిమాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. పూజా హెగ్డే "లైఫ్ అంటే ఇట్టా ఉండాలా" అనే స్పెషల్ సాంగ్‌లో చిందులేసి ఆడియెన్స్‌ను అలరించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



