తొమ్మిదేళ్ల తరవాత ఆ హీరోతో హన్సిక?
on Aug 5, 2020
'దేశముదురు'తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయమైన హన్సిక, ఆ తరవాత నాలుగేళ్లకు తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు. ధనుష్ సరసన నటించిన 'మాపిళ్ళై' ఆమెకు తొలి తమిళ సినిమా. ఆ తరవాత తమిళంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలు చేశారు. తమిళ తంబీలు హన్సికను జూనియర్ ఖుష్బూగా అభివర్ణించారు. తమిళంలో స్టార్ హీరోలతో హన్సిక నటించారు. అయితే, తొలి సినిమా హీరో ధనుష్ పక్కన మరో సినిమా చేయలేదు. ఇప్పుడు చేయబోతున్నారట.
'మాపిళ్ళై' విడుదలైన తొమ్మిదేళ్ల తరవాత ధనుష్‌తో నటించే అవకాశం హన్సికకు వచ్చిందని కోలీవుడ్ టాక్. ధనుష్ హీరోగా దర్శకుడు మిత్రన్ జవహర్ ఒక సినిమా చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆ సినిమా హీరోయిన్ రేసులో హన్సిక ఫస్ట్ ప్లేసులో ఉందట. కరోనాకి ముందే ఆమెను ఫైనలైజ్ చేశారట. 'మాపిళ్ళై'లో ధనుష్, హన్సిక జోడీ, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. తొమ్మిదేళ్ల తరవాత చేయబోతున్న ఈ సినిమాలో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో? వెయిట్ అండ్ సి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
