గ్రాండ్ గా గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీ లాంఛ్!
on Dec 24, 2021

మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి జట్టు కట్టి హ్యాట్రిక్ పై కన్నేసింది ఈ కాంబో. ఇప్పటికే ఈ హ్యాట్రిక్ మూవీ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా గ్రాండ్ గా లాంఛ్ అయింది.
గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, వీవీ వినాయక్, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కి వినాయక్ క్లాప్ కొట్టగా, టీజీ వెంకటేష్ కెమెరా స్విచాన్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇది గోపీచంద్ కెరీర్ లో 30 వ సినిమా. 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలతో మంచి విజయాలను అందుకున్న గోపీచంద్, శ్రీవాస్ కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



