బాలయ్యతో గోపీచంద్ మలినేని చిత్రం?
on Jan 13, 2021

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన క్రాక్ చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. బలుపు తరువాత సరైన విజయం లేని గోపీచంద్ కి ఈ కాప్ డ్రామా.. సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. నటసింహ నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ తదుపరి చిత్రం ఉండొచ్చని తెలిసింది. ప్రస్తుతం ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్. త్వరలోనే బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం బాలకృష్ణ తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవిలో విడుదల కానుంది. ఆపై బి. గోపాల్, సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, సాగర్ చంద్రతోనూ బాలయ్య సినిమాలు ఉంటాయని వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



