పాతికేళ్ళ ధర్మచక్రం
on Jan 13, 2021

విక్టరీ వెంకటేష్ కి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందించిన చిత్రాల్లో ధర్మచక్రం ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి. రామానాయుడు నిర్మించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్రముఖ తమిళ దర్శకుడు సురేష్ కృష్ణ రూపొందించారు. వెంకీకి జోడీగా రమ్యకృష్ణ, ప్రేమ నటించిన ఈ సినిమాలో శ్రీవిద్య, గిరిష్ కర్నాడ్, బ్రహ్మానందం, ఏవీయస్, జేవీ సోమయాజులు, రాళ్ళపళ్ళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా డి. రామానాయుడు అతిథి పాత్రలో దర్శనమిచ్చారు.
సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. చెప్పనా చెప్పనా చిన్నమాట.., ధీరసమీరే యమునా తీరే, సొగసు చూడ హాయి హాయిలే.. వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ గీతాలకు వేటూరి సుందరరామ్మూర్తి, చంద్రబోస్ సాహిత్యమందించారు. 1996 జనవరి 13న విడుదలై 19 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ధర్మచక్రం.. నేటితో పాతికేళ్ళను పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



