మాస్టర్.. అనిరుధ్ ట్రాక్ రికార్డ్ తేడాగా ఉందే?
on Jan 12, 2021
.jpg)
ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజా చిత్రం మాస్టర్.. రేపు (జనవరి 13) తమిళ, తెలుగు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కోలీవుడ్ స్టార్స్ విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై రెండు భాషల్లోనూ పాజిటివ్ వైబ్స్ నే ఉన్నాయి. అయితే తేడా కొట్టే విషయం మాత్రం ఒకటుంది. అదే.. అనిరుధ్ టచ్.
కోలీవుడ్ లో సంగీత దర్శకుడు అనిరుధ్ కి తిరుగులేని స్టార్ డమ్ ఉంది. అయితే, తెలుగులో మాత్రం అంత సీన్ లేదు. అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. డబ్బింగ్ సినిమాల్లోనూ చాలా మటుకు నిరాశపరిచాయి. మరీ ముఖ్యంగా.. సంక్రాంతి సీజన్ లో అనిరుధ్ నుంచి వచ్చిన స్ట్రయిట్, డబ్బింగ్ బొమ్మలన్నీ తేడా కొట్టాయి.
2018లో తెలుగు చిత్రం అజ్ఞాతవాసి, తమిళ అనువాద చిత్రం గ్యాంగ్ రిలీజ్ కాగా.. రెండూ నిరాశపరిచాయి. ఇక 2019లో పేట, 2020లో దర్బార్.. ఇలా సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో అనిరుధ్ చేసిన సంక్రాంతి చిత్రాలదీ అదే పరిస్థితి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న అనిరుధ్ కి ఈ సంక్రాంతికి వస్తున్న మాస్టర్ ప్లస్ అవుతుందా? లేదంటే మాస్టర్ పై అతని నెగటివ్ ట్రాక్ రికార్డ్ ప్రభావం కొనసాగుతుందా? రేపటి వరకు వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



