100 కోట్ల క్లబ్ లో 'గాడ్ ఫాదర్'.. ఏది నిజం?
on Oct 9, 2022

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ రాజా రూపొందించిన చిత్రం 'గాడ్ ఫాదర్'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుపుతూ తాజాగా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.
అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకీ, 'గాడ్ ఫాదర్' నిర్మాతలు విడుదల చేస్తున్న పోస్టర్స్ కి వ్యత్యాసం కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం మొదటి రోజు రూ.32.70 కోట్ల గ్రాస్ రాబట్టిందని అంచనా వేయగా.. నిర్మాతలు మాత్రం రూ.38 కోట్లకి పైగా గ్రాస్ వచ్చినట్టు పోస్టర్ వదిలారు. ఇక రెండు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుండగా.. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం రెండు రోజుల్లో రూ.69 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టుగా ఉంది.

అలాగే గాడ్ ఫాదర్ మూవీ నాలుగు రోజుల్లో రూ.77 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండగా.. తాజాగా ప్రొడ్యూసర్స్ మాత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు ఓ పోస్టర్ విడుదల చేశారు. అయితే పోస్టర్ లో ఎన్ని రోజుల్లో ఈ వసూళ్ళు వచ్చాయనే విషయాన్ని పేర్కొనలేదు. దీంతో అవి నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్లా లేక ఈరోజు(ఐదు రోజు) కలెక్షన్లు కూడా కలిపారా అనే విషయంపై స్పష్టత లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



