విడుదలకు సిద్దమవుతున్న “భగవత్ రామానుజులు”
on Nov 15, 2015

శ్రీరామానుజ సహశ్రాబ్ది సందర్బంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజియ్యరు స్వామి వారి ఆశీస్సులతో, శ్రీ అనంత శ్రీ విభూషిత త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జియ్యరు స్వామి వారి మంగళా శాసనములతో అమృతా క్రియేషన్స్ నిర్మిస్తున్న "భగవత్ రామానుజులు" గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతున్నట్లు దర్శకురాలు శ్రీమతి మంజుల సూరోజు తెలిపారు.
విశిష్ఠాద్వైత సిద్దాంతాన్ని మానవాళికి అందించిన శ్రీ రామానుజ చార్యుల జీవిత చరిత్రను భక్తి, ఆద్యాత్మిక స్పర్శతో రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రత్యేక పాత్రలో విష్ణు మూర్తి గా డా. గజల్ శ్రీనివాస్ అద్భుతంగా నటించారని ఇతర పాత్రలలో లక్ష్మి దేవిగా ప్రమోదిని, రామనుజులుగా శ్రీ సూర్య భగవాన్ లు నటించగా ఇతర పాత్రలలో అశోక్ కుమార్, అన్నపూర్ణ వంటి నటులు నటించారని, సంగీతం పి. జె. నాయుడు, సినిమాటోగ్రఫీ తోట వి రమణ, ఎడిటింగ్ శ్రీనివాస కె మోపర్తి, మాటలు సాయిబాబా, పాటలు శ్రీ వేదవ్యాస్, మామిడి శర్వాణి సాంకేతిక సహకారాన్ని అందించినట్లు తెలిపారు.
ఈ చిత్ర నిర్మాత మర్రి జమునా రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం మరియు హిందీ లలో కూడా అనువాదం చేయనున్నట్లు తెలిపారు. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకుని ముక్కోటి ఏకాదశికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



