ఆయన్ని అనుష్కనే ఆదుకోవాలి
on Nov 15, 2015
.jpg)
క్రియేటివ్ డైరెక్టర్‌గా కృష్ణవంశీకి బోల్డు పేరుంది. కానీ లేనిదల్లా కమర్షియల్ హిట్టే. చందమామ తరవాత నికార్సయిన విజయం చవి చూళ్లేదు క్రిష్ణవంశీ. గోవిందుడు అందరివాడేలే..తో ట్రాక్ ఎక్కడానుకొన్నారు. కానీ ఏం లాభం..?? ఆ సినిమా సైతం నిర్మాతకు నష్టాల్ని మిగిల్చింది. ఇప్పుడు ఎప్పట్లా.. తన మార్క్ చూపించాలన్న ఉద్దేశంతో లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసి దిల్‌రాజు దగ్గరకు వెళ్లారు. ఆయనేమో.. ''చిన్న సినిమాగా ఏం తీస్తాం. పెద్ద హీరోయిన్‌ని వెదికి పట్టుకొని.. భారీగా చేద్దాం'' అన్నాడు.
గత యేడాది నుంచి ఈ సినిమాలో హీరోయిన్ కోసం తెగ వెదుకుతున్నాడు కృష్ణవంశీ. ఇప్పుడు ఆయనకు అనుష్క ఓ దేవతలా కనిపిస్తోంది. ఈ సినిమాని నేమూ, ఫేమూ, మార్కెట్లూ ఉన్న అనుష్కతో లాగిస్తే.. నాలుగు డబ్బులొస్తాయన్నది కృష్ణవంశీ ఆలోచన. అనుష్క యస్.. అంటే.. ఈ సినిమాని పట్టాలెక్కించడానికి దిల్‌రాజు కూడా రెడీగానే ఉన్నాడు. మరి అనుష్క ఓకే అంటుందో, లేదో... అన్న సందేహం నెలకొంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. అనుష్కకు బోర్ కొట్టేసిందట.
కొంతకాలం ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలనుకొంటోంది. దానికి తోడు కృష్ణవంశీకీ సరైన విజయాల్లేవు. ఈ దశలో రిస్క్ తీసుకోవడం ఎందుకూ.. అని జేజమ్మ అనుకొంటే.. కృష్ణవంశీకి గడ్డుకాలమే. అదే.. గుణశేఖర్‌ని ఆదుకొన్నట్టు.. కృష్ణవంశీనీ ఆదుకొంటే ఏమవుతుందిలే అని ఉదారత చూపిస్తే.. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం. ఇప్పుడు కృష్ణవంశీ ఫ్యూచర్ కాస్త.. అనుష్క చేతుల్లోకి వెళ్లిందన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



