సినీక్రిటిక్స్ కి షాకిచ్చిన సల్మాన్
on Nov 16, 2015

సినిమా విశ్లేషకులకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మళ్ళీ షాకిచ్చాడు. దీపావళి స్పెషల్ గా రిలీజైన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తాతల కాలంనాటి సినిమా అంటూ సినీ క్రిటిక్స్ ఈ సినిమాని తమ రివ్యూలతో ఏకి పారేశారు. కానీ ఆ రివ్యూలతో సంబంధం లేకుండా సినీ అభిమానులు ఈ సినిమాకి కాసుల వర్షం కురిపిస్తున్నారు.
తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా..తన హావాను బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగిస్తూనే వుంది. మొదటి మూడు రోజుల్లో హిందీ వెర్షన్ 101.47 కోట్లు వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంకా ఆదివారం కలెక్షన్లు బయటకు రావాల్సి వుంది. అలాగే హిందీతో పాటు తెలుగు తమిళ్ లోనూ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు తమిళ్ వసూళ్లు కలిపితే కలెక్షన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా వుంది.
క్రిటిక్స్ ఈ సినిమాని ఏకి పారేసిన..ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతచేసుకోవడం సల్మాన్ బాక్స్ ఆఫీస్ పవరెంటో మరోసారి నిరూపితమైంది. అదీ సంగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



