హీరోల సినిమాల రేంజ్ లో 'ఘాటి' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే షాక్!
on Sep 4, 2025
.webp)
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఘాటి'. రేపు(సెప్టెంబర్ 5) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు తెలుగునాట అనుష్క స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉండేదో తెలిసిందే. ఇప్పుడు కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 'ఘాటి' రూపంలో తన ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ అదిరిపోయే థియేట్రికల్ బిజినెస్ చేసింది. (Anushka Shetty)
నైజాంలో రూ.6.5 కోట్లు, సీడెడ్ లో రూ.3.5 కోట్లు, ఆంధ్రాలో రూ.9 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో 'ఘాటి' రూ.19 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.6 కోట్లు, ఓవర్సీస్ రూ.4 కోట్లు కలిపి.. ఓవరాల్ గా రూ.29 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.30 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. (Ghaati Movie)
మీడియం రేంజ్ హీరోల సినిమాలు రూ.30 కోట్ల థియేట్రికల్ చేస్తే.. అది గొప్ప అన్నట్టే. అలాంటిది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ దాదాపు 30 కోట్ల బిజినెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కేవలం అనుష్క స్టార్ డమ్ వల్లే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



