ఎన్టీఆర్ రికార్డును సమం చేసిన పవన్..!
on Sep 4, 2025

యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఒకప్పుడు అక్కడ 1 మిలియన్ డాలర్ మార్క్ దాటితే గొప్ప అన్నట్టుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రీమియర్ ప్రీ సేల్స్ తోనే పలువురు స్టార్స్ ఆ ఫీట్ సాధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ' సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మూడు వారాల ముందే ఈ చిత్రం 1 మిలియన్ ఫీట్ సాధించడం విశేషం. అంతేకాదు, ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డును కూడా పవన్ సమానం చేశాడు. (They Call Him OG)
యూఎస్ లో అత్యధిక వన్ మిలియన్ డాలర్ సినిమాలున్న తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పటిదాకా మహేష్ నటించిన 12 సినిమాలు అక్కడ 1 మిలియన్ క్లబ్ లో చేరాయి. ఆ తర్వాతి స్థానంలో 11 సినిమాలతో నాని ఉన్నాడు. తొమ్మిది సినిమాలతో మూడో స్థానంలో ఎన్టీఆర్ ఉండగా.. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి పవన్ కూడా వచ్చాడు. పవన్ కెరీర్ లో యూఎస్ లో 1 మిలియన్ క్లబ్ లో చేరిన తొమ్మిదో సినిమాగా 'ఓజీ' నిలిచింది. (Pawan Kalyan)
నార్త్ అమెరికాలో 'ఓజీ' పలు రికార్డులు క్రియేట్ చేసే అవకాశముంది. ప్రీమియర్స్ పరంగా 3.9M తో కల్కి, 3.5M తో ఆర్ఆర్ఆర్, 3.3M తో పుష్ప-2 మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఓజీ జోరు చూస్తుంటే.. టాప్-3 లో చేరేలా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



