ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. హిట్ కొట్టిన 'గాలోడు'
on Nov 23, 2022
ఫ్లాప్ టాక్ తో బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'గాలోడు' చేరిపోయింది. కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది.
సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం 'గాలోడు' నవంబర్ 18న విడుదలైంది. ఈ చిత్రం మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా అంచనాలకు మించి వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.21 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.1.14 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.1.61 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.84 లక్షల గ్రాస్, ఐదో రోజు రూ.65 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన 'గాలోడు'.. ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.5.45 కోట్ల గ్రాస్(రూ.2.92 కోట్ల షేర్) రాబట్టినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.5.55 కోట్ల గ్రాస్(రూ.2.97 కోట్ల షేర్) సాధించిందని సమాచారం.
ఓవరాల్ గా రూ.2.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గాలోడు ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని, ఈ రోజు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
