హాస్పిటల్ బెడ్‌పై అబ్బాస్.. వర్రీ అయిన ఫ్యాన్స్!
on Nov 23, 2022
'ప్రేమదేశం' హీరో అబ్బాస్ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆగస్టులో ఒక యాక్సిడెంట్ కారణంగా గాయపడిన ఆయనకు ఇటీవల సర్జరీ చేశారు. ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్‌లో ఉంటున్నారు. కొన్నెళ్లుగా నటనకు దూరమైన ఆయన, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆగస్టులో బైక్ యాక్సిడెంట్‌కు గురైన ఆయన కుడి మోకాలి లిగమెంట్ తెగింది. అప్పట్నుంచీ చేతికర్ర సాయంతో నడుస్తూ వస్తున్నారు అబ్బాస్.
ఇప్పుడు నవంబర్ 18న ఆయనకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ తర్వాత హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు అబ్బాస్. "హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాలోని ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నంతసేపూ కొన్ని భయాల్ని ప్రయత్నంతో అధిగమించా. నా మనసుకు ధైర్యం చెప్పుకున్నా. సర్జరీ బాగా జరిగింది. త్వరలోనే ఇంటికి తిరిగి వెళ్తాను. నా గురించి ప్రార్థించిన, శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్" అని రాసుకొచ్చారు.
కదిర్ డైరెక్ట్ చేసిన 'ప్రేమదేశం' మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ కావడంతో అందులో నటించిన ప్రభాస్, వినీత్, టబు రాత్రికి రాత్రి స్టార్స్ అయిపోయారు. ఆ తర్వాత అబ్బాస్‌కు తెలుగులోనూ పలు అవకాశాలొచ్చాయి. క్రమంగా డిమాండ్ తగ్గిపోతుండటంతో ఏడేళ్ల క్రితం నటనకు దూరమైన ఆయన తన ఫ్యామిలీతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయి, అక్కడే స్థిరపడ్డారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
