ఎన్టీఆర్ మూవీలో శ్రీదేవి.. భలే ఉంది.!!
on Oct 10, 2018
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ గా బాలకృష్ణ, చంద్రబాబుగా రానా, ANR గా సుమంత్.. ఇలా విడుదలైన ప్రతి లుక్ సినిమా మీద అంచనాలను పదింతలు పెంచుకుంటూ పోతుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుండి మరో లుక్ విడుదలైంది. ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో శ్రీదేవిగా కన్పించబోతున్న రకుల్ ఫస్ట్‌లుక్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. తెల్లటి బొట్టు, చీర కట్టులో రకుల్ శ్రీదేవిలా అందంగా కనిపిస్తున్నారు. బాలకృష్ణ, రానా, సుమంత్ లాగానే రకుల్ కూడా తన లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.