అతిలోకసుందరి మేలిమి సోయగాలు
on Jul 19, 2014
ఆమె వయసు ఉదహరించాలంటే మనసు రాదు... పదహారేళ్ల వయసు నుంచి నేటి వరకు వయసుతో పాటు పెరిగినది ఏదైనా వుంటే అది ఆమె అందం మాత్రమే. పెళ్లి, ఇద్దరు పిల్లలు, అయినా ఆమె అతిలోక సుందరే అనిపిస్తోంది..

అలా ర్యాంప్ పై వాక్ చేస్తు శ్రీదేవి కనిపిస్తే నోరెళ్లబెట్టి చూస్తూనే వుండిపోయారు వచ్చినవారంతా...
అతిలోక సుందరి కితాబుకు పూర్తి న్యాయం చేస్తూ శ్రీదేవి ఇలా ఈ మధ్య జరిగిన ఓ ఫ్యాషన్ షోలో కనిపించింది. బంగారు నగలు, బంగారు వన్నే దుస్తులు, అంతకన్నా మేలిమి సోయగంతో శ్రీదేవి... ఇలా మెరిసిపోయింది..

బాలీవుడ్ లోని పాతికేళ్ల పడుచులకు ఈ ఫ్యాషన్ షోలో శ్రీదేవి పోటీనిచ్చింది. పరిణితీ, సోనమ్, క్రితి సనన్ లాంటి నేటి తరం అమ్మాయిలకు ధీటుగా అలరించింది ఈ నిన్నటి తరం నటీమణి.
ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా ఇంటర్నేష్‌నల్ జ్యూవలెరీ వీక్ గ్రాండ్ ఫినాలేలో ఈ సుందరిమణులు ఇలా తళుక్కుమన్నారు.
మరిన్నిశ్రీదేవి చిత్రాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



