'సీఎస్ఐ సనాతన్'గా ఆది కొత్త అవతారం!
on Jan 31, 2022

'ప్రేమ కావాలి' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన ఆది సాయికుమార్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఒకటి అరా హిట్స్ అందుకున్న ఆది.. సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో వరుస విభిన్న సినిమాలను ఎంచుకుంటున్న ఆది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
చాగంటి ప్రొడక్షన్ లో ఆది హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సీఎస్ఐ సనాతన్'. ఈ సినిమాలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీఎస్ఐ) ఆఫీసర్ గా ఆది కనిపించనున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

'సీఎస్ఐ సనాతన్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడి ఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి.
చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్ తదితరులు నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



