మహేష్ ప్లేస్ లోకి తుఫానులా దూసుకొచ్చిన విజయ్!
on Jan 31, 2022

టాలీవుడ్ స్టార్స్ లో ఎక్కువగా యాడ్స్ చేసే హీరో అంటే మహేష్ బాబు అని చెప్పొచ్చు. తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి పలు కార్పొరేట్ కంపెనీలు మహేష్ ని సంప్రదిస్తుంటాయి. మహేష్ సైతం పలు యాడ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంటాడు. వాటిలో 'థమ్స్ అప్' కూల్ డ్రింక్ యాడ్ ఒకటి. ఈ యాడ్స్ లో మహేష్ చేసే స్టంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మహేష్ ప్లేస్ లోకి 'తుఫాను'లా దూసుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇక 'థమ్స్ అప్' యాడ్ లో విజయ్ సందడి చేయనున్నాడు. 'సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్' అంటూ విజయ్ తో ప్రమోషన్స్ షురూ చేసింది థమ్స్ అప్. యాడ్ లో విజయ్ చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సినిమా సీన్స్ ని తలదన్నేలా స్టంట్స్ ఉన్నాయి. ఇక ఈ యాడ్ కోసం విజయ్ ట్విట్టర్ అకౌంట్ లో తన పేరు పక్కన తుఫాన్ అని పెట్టుకోవడం విశేషం.
విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



