ఫిబ్రవరి 17 అందరికీ టెన్షన్ కలిగిస్తోంది!
on Jan 10, 2023

సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ఎప్పటినుండో విడుదల డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉంది. అప్పట్లోనే ప్రమోషన్స్ హడావిడి బాగా కొనసాగినప్పటికీ సినిమాకు విడుదల కాలేదు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అంచనాలను మించి ఉంది. గుణశేఖర్ తన ప్రాణం పెట్టి ఈ చిత్రం చేశాడని అర్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో ఇలాంటి పౌరాణిక ప్రేమ గాధను తీయడం అంటే అది మామూలు విషయం కాదు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఎంతో గ్రాండియర్‌గా, భారీ సెట్స్‌తో అద్బుతమైన సంభాషణలతో సాగిన ఈ చిత్రం ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను పెంచుతోంది.
ఇక ఈ సినిమాకు సమంత క్రౌడ్ పుల్లర్ కానుంది. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటిస్తే, శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించడం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. దాంతో ఈ చిత్రానికి ఓపెనింగ్ కి ఢోకా ఉండదనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణ భాగస్వామి కావడంతో ఆయన సమక్షంలోనే విడుదల కాబోతోంది కాబట్టి థియేటర్ల విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన సార్ సినిమా అదే తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కూడా థియేటర్ల సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. అయితే మరో ఇద్దరు చిన్న హీరోలకు మాత్రం థియేటర్లో దొరికిన మిగతా రెండు సినిమాల ప్రభావం వలన కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. విశ్వక్సేన్ దమ్కీ సినిమాతోపాటు కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ రెండు సినిమాలు 17వ తేదీన రాబోతున్నాయి. విశ్వక్సేనుకు మాస్కా దాస్ అనే ఒక బ్రాండ్ ఉంది. దాంతో ఆయన కనీస ఓపెనింగ్స్ తెప్పించుకోగలరు. ఇక వినరో భాగ్యము విష్ణు కథను గీత ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తూ ఉండడంతో దీనికి కూడా డోకా లేదు. మొత్తానికి ఈ నాలుగు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ వీటిలో శాకుంతలం చిత్రం పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ సినిమాలకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ మరోవైపు నుంచి ఈ సినిమాకు అదే స్థాయిలో మైనస్ పాయింట్లు ఉన్నాయి.
అందునా ఫిబ్రవరి అనేది తెలుగు సినిమాలకు అన్ సీజన్ గా చెప్తారు. ఇక ఈ నాలుగు చిత్రాలు వేటికవే విభిన్నమైనవి కావడం విశేషం. శాకుంతలం చిత్రం పౌరాణిక ప్రేమకథాచిత్రం కాగా సార్ చిత్రం కోలీవుడ్ ధనుష్ హీరోగా ఓ సపరేట్ స్టైల్లో సాగనుంది. దాస్ కి థమ్కీ చిత్రం ధమాకా తరహాలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.... వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం పూర్తిగా లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ. మరి వీటిలో ఏ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడతారో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



