'ప్రేమమ్' దర్శకుడి కోరిక.. 'విక్రమార్కుడు'ని ఇంగ్లీష్ లో రీమేక్ చేయాలి!
on Jan 10, 2023

మలయాళం 'ప్రేమమ్' డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రెన్ ఒక్క సినిమాతో తన మార్కు చూపించారు. ప్రేమమ్ సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. అక్కడ కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ డైరెక్టర్ 'గోల్డ్' అనే సినిమా తీశారు. కనీసం టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా సర్ప్రైజ్ చేయాలని అనుకోగా ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయ్యింది. గోల్డ్ కాస్త రోల్డ్ గోల్డ్ గా మారింది.
తాజాగా ఈ డైరెక్టర్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పి తన విష్ లిస్ట్ ఒకటి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన సినిమా విశేషాలు, కొన్ని కాంబినేషన్స్ గురించి ఆయన ప్రస్తావించారు. వాటిలో ముఖ్యంగా రాజమౌళి తన విక్రమార్కుడు సినిమాని ఇంగ్లీషులో తీయాలని సూచించారు. కాలేజ్ పాపల బస్సు పాటకి జాకీచాన్, విల్ స్మిత్ ఇంకా సూటబుల్ యాక్ట్రెస్ డాన్స్ చేయాలని ఆ పాటను ఇప్పటి స్టైల్ కి తగ్గినట్టు తీయాలని అన్నారు. రాజమౌళికి ఇంటర్నేషనల్ ఐడెంటిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన బాహుబలి 1,2.. ఆర్ఆర్ఆర్ సినిమాలు ఆయనను ప్రపంచ సినిమాకు పరిచయం చేశాయి. అందుకే 'ప్రేమమ్' డైరెక్టర్ తన విష్ లిస్టులో రాజమౌళి 'విక్రమార్కుడు' సినిమాని రీమేక్ చేయాలని కోరారు.
అంతేకాదు కమల్ హాసన్ 24 క్రాఫ్ట్స్ గురించి సినిమా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయాలని, దాని వల్ల లక్షల మంది కొత్త స్టూడెంట్స్ సినిమా గురించి తెలుసుకుంటారని కామెంట్ పెట్టారు. అంతేనా ఇంకా మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఒక యాక్షన్ డ్రామాలో నటించాలని దానికి పృథ్వీరాజ్ డైరెక్టు చేయాలని... ఇలా తన విష్ లిస్ట్ చాలా పెద్దదిగానే రాసుకున్నారు. ప్రేమమ్ డైరెక్టర్ చెప్పిన ఇవన్నీ జరుగుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఒక డైరెక్టర్ గా ఆయన విష్ లిస్ట్ ఫన్నీగా ఫేస్ బుక్‌లో షేర్ చేసి ఆడియన్స్‌ను అలరించారు ప్రేమమ్ డైరెక్టర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



