డోంట్ వర్రీ: నసీరుద్దీన్ షా బాగున్నారు
on May 1, 2020

ప్రముఖ హిందీ నటుడు, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం మృతి చెందారు. ఆయన మరణించి 24 గంటలు గడవక ముందే కథానాయకుడిగా రొమాంటిక్ సినిమాలతో, నటుడిగా వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రిషి కపూర్ మృతి చెందారు. ఈ రెండు మరణాల నుండి హిందీ చిత్ర పరిశ్రమ కోలుకముందు మరో పిడుగులాంటి మాట ప్రేక్షకుల ముందుకొచ్చింది. నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ఉన్నారనీ, ఆయన పరిస్థితి విషమంగా ఉందనీ వార్తలు వచ్చాయి. దాంతో పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు ఆందోళన చెందారు. ఈ ఆందోళనకు నసీరుద్దీన్ షా తనయుడు వివాన్ షా తెరదించారు. తన తండ్రి ఆరోగ్యంగా, బాగున్నారని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేశారు.
"హలో... అందరికీ నమస్కారం. అంతా బాగుంది. బాబా (తండ్రిని ఉద్దేశిస్తూ) జస్ట్ ఫైన్. నాన్న బాగున్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్నవన్నీ రూమర్స్. ఫేక్ న్యూస్. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇర్ఫాన్ భాయ్, చింటూ (రిషి కపూర్) జీ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళిద్దరి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. మనందరికీ కోలుకోలేని నష్టం ఇది" అని వివాన్ షా ట్వీట్ చేశారు. దాంతో పుకార్లకు చెక్ పెట్టినట్టు అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



