'F3' రెండు రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కి చాలా దూరం!
on May 29, 2022
'నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్' అంటూ ఫన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'F3' మూవీ నవ్వులు పంచుతూ కలెక్షన్లు బాగానే కొల్లగొడుతోంది. శుక్రవారం(మే 27న) విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.65 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. రెండో రోజు కూడా అదే దూకుడు కొనసాగించిన f3 రూ.9.85 కోట్లు కలెక్ట్ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటిరోజు 10.35 కోట్ల షేర్ రాబట్టిన 'F3' మూవీ.. రెండో రోజు 8.35 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు రోజులలో ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో 18.70 కోట్ల షేర్(30.25 కోట్ల గ్రాస్) వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.53.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 34.75 శాతం రికవరీ సాధించింది. రెండు రోజుల్లో నైజాంలో 8.16 కోట్లు(బిజినెస్ 18 కోట్లు), సీడెడ్ లో 2.38 కోట్లు(బిజినెస్ 8.40 కోట్లు), ఆంధ్రాలో 8.16 కోట్ల(బిజినెస్ 27.40 కోట్లు) షేర్ వచ్చింది.
రెండు రోజుల్లో కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 1.20 కోట్లు, ఓవర్సీస్ 3.60 కోట్ల షేర్ రాబట్టిన 'F3' మూవీ.. వరల్డ్ వైడ్ గా 23.50 కోట్ల షేర్ (39.80 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. నేడు ఆదివారం కావడంతో 50 కోట్ల గ్రాస్ మార్క్ అందుకునే అవకాశముంది. వరల్డ్ వైడ్ గా 63.60 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో 36.94 శాతం(23.50 కోట్ల షేర్) రికవరీ సాధించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఈ మూవీ 40 కోట్ల దూరంలో ఉంది.
Also Read