'అంటే సుందరానికీ' ట్రైలర్.. నవ్వులే నవ్వులు!
on Jun 2, 2022
.webp)
నేచురల్ స్టార్ నాని వెండితెరపై నవ్వులు పూయించడానికి సిద్ధమవుతున్నాడు. నాని నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.
ఇప్పటికే విడుదలైన 'అంటే సుందరానికీ' గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా విడువులైన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సుందర ప్రసాద్(నాని) లైఫ్ లో ఒక్కసారైనా అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. కానీ అతని ఫ్యామిలీ మాత్రం విశ్వనాథ శాస్త్రి గారి మనవడివైన నువ్వు సముద్రాలు దాటుతావా ఇంకేమైనా ఉందా? అంటూ అడ్డుపడుతారు. శాస్త్రి గారి మనవడిగా పద్ధతిగా పెరిగిన సుందర ప్రసాద్ క్రిస్టియన్ యువతి(నజ్రియా) ప్రేమలో పడతారు. హిందూ-క్రిస్టియన్ లవ్ స్టోరీతో పాటు ట్విస్ట్ లతో ఆద్యంతం ఆసక్తికరంగా, సరదాగా సాగిపోయింది. చూస్తుంటే ఈసారి నాని గట్టిగానే నవ్వించేలా ఉన్నాడు.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నరేష్, సుహాస్, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్, నదియా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా నికిత్ బొమ్మిరెడ్డి, ఎడిటర్ గా రవితేజ గిరజాల వర్క్ చేసున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



