అఫీషియల్.. 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ వచ్చింది
on Feb 1, 2022
.webp)
మార్చి 11 న 'రాధేశ్యామ్' మూవీ విడుదల కానుంది అంటూ 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్(మార్చి 25) వచ్చినప్పటి నుంచి న్యూస్ వినిపిస్తోంది. తాజాగా 'రాధేశ్యామ్' టీమ్ తమ సినిమా మార్చి 11 నే విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రాధేశ్యామ్'. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 నే విడుదల కావాల్సి ఉండగా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు అందరూ చర్చించుకొని సినిమా విడుదల తేదీలపై ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'(మార్చి 25), భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1), ఆచార్య(ఏప్రిల్ 29), సర్కారు వారి పాట(మే 12) తో పాటు పలు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. తాజాగా 'రాధేశ్యామ్' విడుదలపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్, టీ సిరీస్ కలిసి నిర్మిస్తున్న 'రాధేశ్యామ్'లో కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



