ఎపిక్.. సందీప్ రెడ్డి సినిమాలో హీరో లాంటి అమ్మాయితో ప్రేమలో పడితే..?
on Dec 1, 2025

'90s' వెబ్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్.. దర్శకుడిగా వెండితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో.. బేబీ జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
'90s' వెబ్ సిరీస్ లో రోహన్ పోషించిన ఆదిత్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అతను పెద్దయ్యాక లండన్ కి వెళ్తే, అక్కడ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ.. దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. (Epic - First Semester)
రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన ఎపిక్ టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. తనకి ఎలాంటి భర్త రావాలో వైష్ణవి చైతన్య తన ఫ్రెండ్స్ తో చెప్పే సీన్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. ఆ చెప్పే క్వాలిటీస్ ని పూర్తి భిన్నంగా చిన్నప్పుడు ఆదిత్య ఎలా ఉండేవాడో చూపించడం సరదాగా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ లో గోరేటి వెంకన్న పాట వస్తుండగా.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గెటప్ ని గుర్తు చేస్తూ.. ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. అలాగే "శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ" అనే డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు.
Also Read: సమంత రెండో పెళ్లి.. పూనమ్ సంచలన ట్వీట్!
90s డైరెక్టర్ గా, ప్రేమలు డైలాగ్ రైటర్ గా, లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ గా వరుస సక్సెస్ లు చూశాడు ఆదిత్య హాసన్. 'ఎపిక్' గ్లింప్స్ చూస్తుంటే డైరెక్టర్ గా అతని సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ సాలిడ్ గా ఉండబోతుంది అనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



